అద్భుతమైన బహుమతులు మీ కొరకు వేచి ఉన్నయి!

మీ చిన్నారి గెలుచుకున్న ఒక సెలవు ట్రిప్పుకు వెళ్లడం ఎలా ఉంటుంది?

వినడానికి బాగుంది! కాదంటారా?
పెయింటింగ్ పోటీలో మీ బిడ్డ పాల్గొనడం ద్వారా ‘దేవుని స్వంత దేశం, కేరళ’లో మీకు నచ్చిన ప్రముఖ ప్రదేశాలను సందర్శించేందుకు ఐదు రోజుల పర్యటనను గెలుచుకునే అవకాశం.
పిల్లల అంతర్జాతీయ పెయింటింగ్ పోటీ 2023 విజేతలందరికీ అద్భుతమైన బహుమతులను అందిస్తుంది.

 

బహుమతులు ఐదు విభాగాలుగా విభజించబడింది:

ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా కేరళకు ట్రిప్పు

3 విజేతలు

అన్ని కేటగిరీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలు సావనీర్, సర్టిఫికేట్‌తో పాటు కేరళలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించడానికి ఐదు రోజుల ప్రాయోజిత ట్రిప్ లభిస్తుంది.

10 విజేతలు

భారతదేశం వెలుపల ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మంది విజేతలు కేరళకు ఐదు రోజుల కుటుంబ పర్యటనను గెలుచుకునే అవకాశం ఉంది. విజేతతో పాటు ఇద్దరు సభ్యులు పర్యటనకు వెళ్లవచ్చు. ప్రశాంతత మరియు అందంలో నిండిన నిండిన సరదా కుటుంబ పర్యటనకు సిద్ధంగా ఉండండి!

భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కేరళకు ట్రిప్పు

5 విజేతలు

భారతదేశంలోని ఐదుగురు విజేతలు కేరళకు ఐదు రోజుల కుటుంబ పర్యటనను గెలుచుకునే అవకాశం ఉంది. విజేతతో పాటు ఇద్దరు సభ్యులు పర్యటనకు వెళ్లవచ్చు. మన దేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాల్లో ఒకటి అయిన కేరళలో మీ స్వంత కుటుంబంతో కొన్ని రోజులు గడపడం కంటే అద్భుతమైనది ఏమి ఉంటుంది?

ప్రకృతికి దగ్గరగా ఉండండి

3 విజేతలు

కేరళలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి జ్ఞాపిక, సర్టిఫికేట్‌తోపాటుగా కేరళలోని ప్రముఖ స్థలాల్లో 2 రాత్రులు బస చేయడానికి బుకింగ్ కూపన్ లభిస్తుంది.

ఆకర్షణీయమైన బహుమతులు

70 విజేతలు

భారతదేశానికి వెలుపల 20 మంది విజేతలకు, భారతదేశంలోని 30 మంది విజేతలకు మరియు కేరళలోని 20 మంది విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వబడతాయి.

భారతదేశానికి వెలుపల ప్రమోటర్‌లు

5 విజేతలు

భారతదేశానికి వెలుపల నుంచి ఐదుగురు ప్రమోటర్‌లు గరిష్ట సంఖ్యలో ప్రవేశకులను తీసుకువచ్చే వారు కేరళలోని గమ్యస్థానాలను సందర్శించేందుకు ఐదురోజుల ప్యాకేజీని అందుకుంటారు.

భారతదేశం నుంచి ప్రమోటర్‌లు (కేరళకు వెలుపల)

5 విజేతలు

భారతదేశంలోని మరియు కేరళకు వెలుపల నుంచి ఐదుగురు ప్రమోటర్‌లు గరిష్ట సంఖ్యలో ప్రవేశకులను తీసుకువచ్చే వారు కేరళలోని గమ్యస్థానాలను సందర్శించేందుకు ఐదురోజుల ప్యాకేజీని అందుకుంటారు.

ఇతర పాల్గొన్నవారి అందరికి ఆన్‌లైన్ డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది, ఫలితాలు ప్రకటించిన 6 నెలల్లోపు పాల్గొన్నవారు దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎలాంటి నగదు ప్రత్యామ్నాయాలు లేవు, అందించే విధంగా మాత్రమే బహుమతులు తీసుకోవాలి.

మొత్తం 101 మంది విజేతలు!!

18 మంది విజేతలు కేరళకు కుటుంబ పర్యటనలను గెలుచుకునే అవకాశాన్ని దక్కించుకుంటారు!

10 మంది విజేతలకు సోలో ట్రిప్పు!

 

Landscape Drawing