English
தமிழ்
हिन्दी
తెలుగు
ಕನ್ನಡ
మహోన్నత దైవం యొక్క ఒక గర్భగుడి
కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో ఉన్న శబరిమల శ్రీ ధర్మ శాస్తా ఆలయం అయ్యప్ప స్వామికి అంకితం చేయబడింది. ఒక కొండపై ఉన్న శ్రీ ధర్మ శాస్తా ఆలయం చుట్టూ పర్వతాలు మరియు దట్టమైన అడవులు ఉన్నాయి, ఇవి పెరియార్ టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద వార్షిక పుణ్యక్షేత్రాలలో ఒకటి, ప్రతి సంవత్సరం కోటి నుంచి కోటిన్నర మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని అంచనా. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర కొండ కులమతాలకు అతీతంగా ఆధ్యాత్మిక సాంత్వన కోరుకునే వారందరికీ స్వాగతం పలుకుతుండటం శబరిమల ప్రత్యేకత.
శబరిమల అయ్యప్ప స్వామిని నైష్ఠిక్ బ్రహ్మచారిగా, అంటే "శాశ్వత బ్రహ్మచారి స్థితిలో" ఆరాధిస్తారు.
ఈ ఆలయంలో గర్భగుడి ఉంది, దీని పైకప్పుకు బంగారు పూత పూయబడింది మరియు దాని పైన నాలుగు బంగారు గోపురాలు ఉంచబడ్డాయి. దీని చుట్టూ రెండు మండపాలు, ఒక బలికల్పురము ఉన్నాయి. ఆలయానికి ప్రధాన మెట్ల మార్గంలో పంచలోహంతో కప్పబడిన 18 పవిత్ర మెట్లు ఉన్నాయి. భక్తులు ఇరుముడి కెట్టుతో అంటే వారు దారిపొడవునా తీసుకొచ్చిన నైవేద్యాల రెండు భాగాల పవిత్రమైన సంచితో ఎక్కాలి.
శబరిమల శ్రీ ధర్మ శాస్తా ఆలయానికి సంబంధించి పురాతన కాలంలో ఎటువంటి ప్రస్తావనలు లేవు. ఏదేమైనా, మధ్యయుగ కాలంలో అంటే 12 వ శతాబ్దంలో పందళం రాజవంశం శాసనాలలో ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావనలను చరిత్రకారులు కనుగొన్నారు. ఈ ఆలయం 20 వ శతాబ్దంలో ఒక ప్రధాన పుణ్యక్షేత్రంగా ప్రాచుర్యం పొందింది.
శబరిమల ఆలయం కేరళలోని 1200 కి పైగా దేవాలయాల నిర్వహణను పర్యవేక్షించే స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ట్రావెన్‌కోర్ (ట్రావెన్‌కూర్ / తిరువితాంకూర్) దేవస్థానం బోర్డు నిర్వహించే ప్రధాన ఆలయం.