శబరిమల దేవాలయానికి సంబంధించి అనేక పురాణ కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. అయ్యప్ప కథ ఆలయ మూలాలకు సంబంధించినది. శాస్తా అవతారంగా జన్మించిన అయ్యప్ప శివుడు మరియు మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి కుమారుడు. మహిషి అనే రాక్షసిని సంహరించడమే అయ్యప్ప జన్మకారణం.

తన జన్మకు కారణమైన మహిషి సంహారం ముగిసిన తరువాత, అయ్యప్పస్వామి తన పెంపుడు తండ్రి రాజా రాజశేఖరుడికి వద్దకు వచ్చి, తాను దేవలోకానికి పయనం అవుతున్నట్లుగా తెలియజేస్తాడు. 

అయ్యప్పస్వామి తన గౌరవార్థం ఆలయాన్ని నిర్మించడానికి భగవంతుడు భూమిపై అనువైన స్థలాన్ని కనుగొనాలనే రాజు కోరికను మన్నించాడు. అయ్యప్పస్వామి బాణం వేసినప్పుడు అది శబరి పర్వతంలో పడుతుంది. ఆ విధంగా రాజశేఖర మహారాజు ఆధ్వర్యంలో శబరిమల కొండలో శ్రీ ధర్మ శాస్తా ఆలయాన్ని నిర్మించారు.

20వ శతాబ్దం మధ్య వరకు శబరిమల అంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కాదు. 1950 సంవత్సరంలో అగ్నిప్రమాదం తరువాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం పంచలోహ విగ్రహాన్ని ఆ సమయంలోనే ప్రతిష్ఠించారు. 20వ శతాబ్దం చివరి కాలంలో ప్రతి ఏడాది లక్షలాది భక్తుల సందర్శనతో ఈ దేవాలయం ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా అవతరించింది. 1985లో, 18 పవిత్ర మెట్లకు పంచలోహ తొడుగులను అమర్చారు.

"తత్వమసి" (ఇది నువ్వే) అనే భావన ఆలయాన్ని, తీర్థయాత్రను శాసించే ప్రధాన తత్వం. ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే ఆరాధనా ప్రదేశాల్లో ఒకటిగా ఈ దేవాలయం ఎదిగింది.

చీరప్పన్ చిర కళరి

ప్రఖ్యాత చీరప్పన్ చిర తరవాడ్ (పూర్వీకుల గృహం) అనేది ఆలప్పుజా (ఆలప్పుళ) జిల్లాలోని ముహమ్మలో ఉంది. ఇది అయ్యప్ప పురాణంతో చాలా ముఖ్యమైన రీతిలో ముడిపడి ఉంది. చీరప్పన్ చిర తరవాడ్ నిర్వహించే కళరి [ట్రైనింగ్ గ్రౌండ్]లో అయ్యప్ప స్వామి యుద్ధకళల్లో నిపుణుడిగా శిక్షణ పొందారు. చీరప్పన్ చిర కుటుంబానికి చెందిన పూంకొడి అనే మహిళ అయ్యప్ప స్వామిని ప్రేమించిందని, ఆమె తరువాత మాళికపురత్తమ్మగా మారిందని కొందరు భక్తులు నమ్ముతారు. శతాబ్దాల తరబడి కళరి మరియు అయ్యప్పస్వామి ఉపయోగించినట్లుగా విశ్వసించే కత్తి తరవాడులో సంరక్షించబడింది.

పందళం రాజప్రాసాదం

తన భూమికి పురాణగాథల్లో మరియు కేరళ చరిత్రలో స్థానం సంపాదించిపెట్టినవారు పందళం రాజే. ఆయనకు మరియు ఆయన దత్తత కుమారుడు మణికండన్‌కు మధ్య ఉండే తండ్రికుమారుల బంధం శబరిమలతో విడదీయరాని అనుబంధం ఉంది. నేటికి కూడా, శబరిమలలో జరిగే ఆచారవ్యవహారాల్లో ఈ బంధాన్ని బలపరుస్తాయి. క్రీ.శ 377 లో మదురకు చెందిన పాండ్య రాజవంశానికి చెందిన చెంబళన్నూర్ శాఖ పందళం రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారు. క్రీ.శ. 996లో పందళం ట్రావెన్‌కోర్ (ట్రావెన్‌కూర్ / తిరువితాంకూర్) రాజ్యంలో విలీనం చేయబడింది. 

వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి

Icon for Go To Top