శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం పత్తనంతిట్టలోని అడవిలో ఉంది. కొండపై ఉన్న ఈ ఆలయం చుట్టూ పర్వతాలు, దట్టమైన అడవులు ఉన్నాయి. శబరిమల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కొండ దిగువన ఉన్న పంబా వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. పవిత్ర పంబా ఇక్కడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. నదిలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అనంతరం భక్తులు కొండపైకి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. శబరిమలకు వెళ్లాలనుకునే వారికి కఠినమైన సంప్రదాయ పద్ధతులు, ఆచారాలు, సన్నాహాలు, డ్రెస్ కోడ్ ఉన్నాయి.

శబరిమలకు చేరుకోవడానికి భక్తులు మూడు ప్రధాన మార్గాలను ఎంచుకోవచ్చు - ఎరుమేలి మార్గం, వండిపెరియార్ మార్గం మరియు చాలక్కయం మార్గం. ఎరుమేలి మార్గంలో రెండు దశలు ఉన్నాయి - ఒకటి ఎరుమేలి నుండి పంబా వరకు మరియు రెండవది పంబా నుండి సన్నిధానం వరకు. మొత్తంగా ఈ మార్గం పొడవు 61 కి.మీ. వండిపెరియార్ మార్గం మొత్తం 95 కి.మీ. పంబా చేరుకున్న తర్వాత భక్తులు సన్నిధానానికి చేరుకోవాలంటే కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. వీటిలో అత్యంత సులువైన మార్గం పంబా నదికి సమీపంలో ఉన్న చాలక్కయం మార్గం.

వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి

Icon for Go To Top