ఆయుర్వేదం

 
Ayurveda

ఆయుర్వేదం - దేహం, మనస్సు మరియు ఆత్మ యొక్క సంతులనం
5000 సంవత్సరాలకు పూర్వం ఆధ్యాత్మిక గడ్డ అయిన భారతదేశంలో ఆవిర్భవించిన ఆయుర్వేదం, ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరియు దీనిలో వైద్యం మరియు తాత్విక ఆలోచనలు రెండూ సమ్మిళితమై ఉంటాయి. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా మానవాళి యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మికపరంగా సంపూర్ణంగా ఎదగడానికి దోహదపడుతోంది. ఇవాళ, ఇది ఒక ప్రత్యేకమైన మరియు విడదీయరాని వైద్య విభాగం, పూర్తిగా సహజ సిద్ధమైన ఈ వ్యవస్థ,  శరీర సంతులనం కోసం  శరీరంలోని వట, పిత, కఫ గుణాలను నిర్ధారించడంపై ఆధారపడి ఉంటుంది.

కేరళ, ఆయుర్వేద గడ్డ
కేరళలో సమతుల్యమైన వాతావరణం, సహజ సంవృద్ధి కలిగిన అడవులు మూలికలు మరియు ఔషధ మొక్కలు యొక్క సంపదతో ఉన్నాయి.  వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యులు ( సంప్రదాయ ఆయుర్వేద ప్రాక్టీషనర్‌లు) వద్ద కేరళలోని ప్రతి వ్యాధి నయం కావాలని కోరుకునే వారికి చికిత్స లభిస్తుంది. వైద్యులు (అష్ట వైద్యాస్) యొక్క ఎనిమిది కుటుంబాలు మరియు వారి వారసులు శతాబ్దాల తరబడి రాష్ట్రంలో చికిత్స అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వలే కాకుండా కేరళలో ఆయుర్వేదం ప్రత్యామ్నాయ చికిత్స కాకుండా ప్రధాన స్రవంతి చికిత్సగా నిలుస్తుంది. నిజం చెప్పాలంటే, భారతదేశంలో కేరళలో మాత్రమే ఇప్పుడు పూర్తి నిబద్ధతతో ఈ ఆయుర్వేద విధానం అమలవుతోంది.

ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక రిసార్ట్ చికిత్సతో పాటుగా, కేరళలోని వైద్యయర్‌లు ఆయుర్వేదం యొక్క సిద్ధాంతాలను సవాలు చేయడం నుంచి భాష్యం చెప్పారు మరియు రోజువారీ జీవితంలో సమర్థవంతమైన నివారణ వ్యవస్థల్లోనికి వాటిని చురుగ్గా స్వీకరించారు. తద్వారా దాదాపుగా ఆయుర్వేదంలోని  సమకాలీన విధానాలు మరియు ఆయుర్వేద పద్ధతులు అన్నీ కూడా కేరళ మరియు దాని చుట్టుప్రక్కలే ఉద్భవించాయి.

ప్రకృతి వరదాయిని
సమశీతోష్ణ వాతావరణం, అడవుల సహజ సంవృద్ధి,  కేరళలోని చల్లని రుతుపవనాల కాలం ఆయుర్వేదం యొక్క నివారణ మరియు పునరుద్ధరణ ప్యాకేజీలకు ఉత్తమమైనవి. భూమండలంపై నిరంతరం వర్షాలు పడే కాలంలో కూడా  24-28 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉండే అన్ని కొద్ది ప్రదేశాల్లో బహుశా కేరళ కూడా ఒక్కటి. గాలిలో మరియు చర్మం యొక్క ఉపరితంలో ఈ తేమ ఉండటం వల్ల సహజ ఔషధాలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయి. ఈ గడ్డపై అనేక ఔషధ ప్రయోజనం ఉన్న మొక్కలున్నాయి, ఇవి సమర్థవంతమైన చికిత్సా ప్రక్రియల కొరకు అవసరమైన ఆయుర్వేద ఔషధాలను నిరంతరం అందిస్తూనే ఉన్నాయి. అవే వనమూలికలు అనేక సంవత్సరాలు గడిచినా కూడా అదే సామర్థ్యంతో లభిస్తాయి. విభిన్న మట్టి నిర్మాణం ఉండే ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి మట్టిలో ఉండే ఆల్కలాయిడ్‌లు అనేక ఆయుర్వేద ఔషధాల తీవ్రత మరియు సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.

కేరళలో ఆయుర్వేదం యొక్క ప్రయోజనాలు
అష్టాంహరిద్దయం, కొరకు ఆచరణాత్మక, వాడేవారికి స్నేహపూర్వకంగాఉండేవిధంగా ఆయుర్వేదానికి ముని వాగ్భట్ట చెప్పిన భాష్యం కేరళలో ఉపయోగించినంత విస్త్రృతంగా మరెక్కడా కూడా ఉపయోగించరు. కేరళలోని వైద్యులు ఆయుర్వేదంలో అనేక సమకాలీన చికిత్సలో ప్రావీణ్యం కలిగినవారు, అందువల్లనే ఆయుర్వేద దిగ్గజాలైన చరక మరియు శుశ్రుష యొక్క ముందస్తు సంహితల కంటే మెరుగైనదని చాలామంది స్కాలర్‌లు భావిస్తారు. కేరళ కాయస్థ చికిత్స (కల్పనతో చికిత్స) అనేది ఒక స్టాండర్డ్ ప్రోటోకా‌ల్‌గా ఉంటుంది, దీనిలో వందల కొలదీ కషాయాలను శాస్త్రీయంగా వర్గీకరించి, వివిధ చికిత్స అవసరాలకు అనుగుణంగా క్రమబద్ధీకరిస్తారు. కేరళ వైద్యులు అభ్యంగం యొక్క మొదటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలపై దృష్టి సారిస్తారు, ఇది వారి గొప్పతనాన్ని చాటుతుంది. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా అనేక ఆయుర్వేద కాలేజీలు మరియు పెద్ద సంఖ్యలో ప్రాక్టీషనర్‌లు వల్ల, కేరళలో ఆయుర్వేద పరిశోధన ఒక శాస్త్రీయ రీతిలో సాగేందుకు దోహదపడుతోంది.

జీవనశైలిగా ఆయుద్వేదం
కేరళలో ఆయుర్వేదం అనేది కేవలం ఒక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మాత్రమే కాదు, ఇది కేరళ జీవనశైలిలో ఒక అంతర్భాగం. పక్షవాతం వచ్చిన వ్యక్తులు నడవడం, నయం కాని వ్యాధులు నరయం కావడం మొదలైనవి నేడు సాధ్యం కావడం వల్ల కేరళలోని వైద్యులు  స్ఫూర్తిదాయకమైన గౌరవమర్యాదలను నేడు పొందుతున్నారు.

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

టోల్ ఫ్రీ నెంబరు: 1-800-425-4747 (భారతదేశంలోపల)

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.

×
This wesbite is also available in English language. Visit Close