"మనం ప్రయాణం చేసేది జీవితం నుండి తప్పించుకోవడానికి కాదు, జీవితం మననుండి తప్పించుకోకుండా ఉండడానికి." అప్పుడప్పుడు జీవనోపాధి ఏర్పరచుకోవడంలో నిమగ్నమై, జీవితాన్ని నిర్మించుకోవడం మరచిపోతాం. కార్యాలయం నుండి ఇంటికి, మరియు ఇంటినుండి కార్యాలయానికి...మన జీవితం ఒక మార్పులేని నిత్యకృత్యంలో బందీ అయిపోయిందేమో. తీరిక లీని 'బిజి షెద్యూల్' వల్ల కుటుంబంతో గడపవలసిన విలువైన సమయం కోల్పోయి ఉంటాము. మనం పాత స్నేహితులను కలుసుకుని ఎన్నాళ్ళయ్యింది? వీటన్నింటికి మనకి మనమే పరిహారం చెల్లించుకునే సమయం వచ్చింది. పెట్టి సద్దుకుని కేరళకి బయల్దేరండి. రిఫ్రెష్ బట్టన్ని నొక్కి కొత్త గ్యాపకాలకి నాంది పలకండి/దారి తీయండి. కేరళలో ఎంచుకోవడానికి ఎన్నో ఉన్నాయి. పచ్చని ఉప్పుటేరులు, దట్టమైన హిల్ స్టేషన్స్, అసాధారణమైన, అపురూపమైన వన్యప్రాణులు, పొంగే జలపాతాలు, విశాలమైన తోటలు, సస్యశ్యామలమైన వరి పొలాలు, అద్భుతమైన పండుగలు, మరియు ఆకట్టుకునే కళా రూపాలు. ఇదే కేరళ చేసేది. ఫిల్టర్ద్ వాల్‌పేపర్ కన్నా అందమైన ప్రకృతి దృశ్యాలు, ప్రదేశాల లోనికి జారుకోనిస్తుంది. విసుగు కలిగించే రోజువారీ దినచర్యనుండి మిమ్మల్ని దూరంగా తీసుకెళ్తుంది. పెట్టి సద్దుకుని, బయిటికి వచ్చి, ప్రపంచంలోని అతి సుందరమైన పర్యాటక స్థలాలలో ఒకటైన కేరళ లో ఆనందకరమైన గ్యాపకాలు సృష్టించుకోండి.
పాత గ్యాపకాలు మీరు ఏమి మిస్ చేస్తున్నారో గుర్తుచేస్తున్నాయంటే, కేరళకి వెళ్లి కొత్త మరియు అద్భుతమైన గ్యాపకాలు సృష్టించుకోవలసిన సమయం వచ్చింది. కేరళ ప్రయాణానికి పెట్టి సద్దుకుని, అక్కడి సముద్రతీరాలలొ, కొండలలొ, ఉప్పుటేరులలొ, మరియు అడవులలొ, మీరు కోల్పోయిన సమాయాన్ని భర్తీ చేసుకోండి.
జీవితం ఒక నిస్తేజమైన నిత్యకృత్యంలో పడి, ఆ పాత వెలుగు, మెరుపు కనబడకండా పోతున్నాయంటే, పెట్టి సద్దుకుని, కేరళకి ప్రయాణం కట్టండి. భగవంతుని సొంత దేశం యొక్క కొండలలొ, ఉప్పుటేరులలొ, సముద్రతీరాలలొ మరియు అడవులలొ, ఆ వెలుగుని తిరిగి పొందండి.
అనుకోకుండానే జీవితంలోని అమూల్యమైన క్షణాలని మీరు జారిపోనిచ్చారని అర్ధం చేసుకున్నపుడు కేరళ ప్రయాణానికి పెట్టి సద్దుకొంది. ఎందుకంటె, పోగొట్టుకున్న సమయాన్ని భర్తీ చేసుకోవడానికి భగవంతుని సొంత దేశమైన కేరలకన్నా, అక్కడి సముద్ర తీరాలు, కొండలు, ఉప్పుటేరులు, మరియు అడవులు కన్నా ఉత్తమమైన ప్రదేశం స్థలం ఉండదు.