వెన్నిస్ ఆఫ్ ఈస్ట్‌గా పిలవబడే అలప్పుర, కేరళ మారిటైమ్‌చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని దక్కించుకుంది. ఇవాళ, ఇదిబోటు రేసులు, బ్యాక్‌వాటర్ విహారం, బీచ్, సముద్ర ఉత్పత్తులు మరియు పీచు పరిశ్రమకు ప్రసిద్ధి. అలప్పుర బీచ్ ప్రముఖ పిక్నిక్ స్పాట్. ఇక్కడ సముద్రంలోకి విస్తరించి పీర్, సుమారు 137 సంవత్సరాల పాత కాలం నాటిది. విజయ బీచ్ పార్కు, బీచ్ ఆకర్షణకు అదనపు సొబగులు అద్దుతుంది. బీచ్‌లోని అతి పురాతనమైన లైట్ హౌస్, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
అలప్పురలో మరో అద్భుతమైన అనుభవం హౌస్‌బోట్ క్రూసీ. పాతకాలంలో కెట్టువల్లం అని పిలవబడే పడవులను సందర్శకుల కోసం హౌస్‌బోట్లగా మార్చినవాటిని అలప్పుర బ్యాక్ వాటర్స్‌లో మనం గమనించవచ్చు. కెట్టువళ్లం అనేది మలయాళం పదం, కెట్టు అనగా నిర్మాణం మరియు వళ్లం అనగా పడవ అని అర్థం. కెట్టువల్లంలు యొక్క పైన చెక్క కప్పులపై ఒకప్పుడు టన్నుల కొలదీ బియ్యం మరియు సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లేందుకు ఉపయోగించేవారు.
ఇప్పుడు హౌస్‌బోట్లలో అన్ని రకాల సదుపాయాలు లభిస్తున్నాయి. హోటళ్ల తరహాలో ఫర్నిష్డ్ బెడ్‌రూమ్‌లు,మోడ్రన్ టాయిలెట్లు, కోజీ లివింగ్ రూమ్‌లు, కిచెన్ మరియు బాల్కనీలుకూడా ఉంటాయి. హౌస్‌బోట్‌లో ఉండేటప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా బ్యాక్ వాటర్ కయ్యల్లో సాగే జీవితాన్ని పరిశీలించవచ్చు.
హౌస్ బోట్లు తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, అలప్పుర, ఎర్నాకుళం, త్రిసూర్ మరియు కాసర్‌గోడ్‌లో లభిస్తాయి. మరింత సమాచారం కొరకు డిటిపిసిలను సంప్రదించండి. డిటిపిసి హౌస్ బోట్ ప్రీ పెయిడ్ కౌంటర్, అలప్పుర హౌస్ బోట్ల బుకింగ్ కొరకు, ప్రయాణీకులు జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ (డిటిపిసి) ద్వారా నిర్వహించబడే హౌస్ బోట్ ప్రీ పెయిడ్ కౌంటర్ ‘ట్రస్టెడ్ సర్వీసె, ట్రస్టెడ్ రేట్’ని ఉపయోగించుకోవచ్చు.
సంప్రదించు వివరాలుఅలప్పుర- హౌస్ బోట్ ప్రీ పెయిడ్ కౌంటర్ మొబైల్: 09400051796, 09447483308, +91 477 2251796, +91 477 2253308
అక్కడకు చేరుకోవడందగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: అలప్పుర దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అలప్పుర నుంచి సుమారు 85 కిలోమీటర్లు
లొకేషన్అక్షాంశాలు : 9.492853, రేఖాంశాలు : 76.317726
మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.