దేవుని స్వంత గడ్డ అయిన కేరళలో నడవడంలో మీరు కాస్తంత అలసిపోయారా? విలాసవంతమైన బ్యాక్‌వాటర్ క్రూసీ విలాసాల గురించి ఏమనుకుంటున్నారు? మీరు ‘‘వెన్నిస్ ఆఫ్ ఈస్ట్’’గా పిలిచే అలప్పుర నుంచి ఈ బోటులను అద్దెకు తీసుకోవచ్చు. క్రూసీ నెమ్మదిగా కేరళ అక్షయపాత్రగా పేర్కొనే కుట్టనాడులోని కాలువలు దాటుకుంటూముందుకు సాగుతుంది, ఇరువైపులా ఉండే తాటితోపులు, వరిపొలాలు గాలిలో గుసగుసలాడుతున్నట్లుగా మీకు స్వాగతం పలుకుతాయి. మీ
తరువాత కేరళలోని ప్రముఖ టూరిస్ట్ కేంద్రం అయిన కమర్‌కన్‌వైపుకు మనం బయలు దేరుతుంది. కమర్‌కమ్ చేరుకున్న తరువాత మీరు మరో అందమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. ఈ చిన్న బ్యాక్ వాటర్ గ్రామం, అనేకదీవుల సమాహారం, ఇక్కడ వారి జీవితం ఎంతో వైవిధ్యభరితమైనది, ఎంతో నెమ్మదిగా అందమైన లయతో సాగుతుంటుంది. దృశ్యాలు, శబ్ధాలు, సువాసనలు అన్నీ కూడా మీ మదిని దోచుకుంటాయి. కమర్‌కమ్‌లో ఉండి,కాస్తంత విశ్రాంతి తీసుకున్న తరువాత మీరు వైకమ్‌కు బయలు దేరవచ్చు.
వైకమ్‌కు వెళ్లే తోవలో మీరు వెంబనాడ్ చెరువు అందాలను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. కేరళలోని అతి పెద్ద బ్యాక్ వాటర్ స్ట్రెచ్‌లో విశ్రాంతి పొందండి. ఇరువైపులా ఉండే పచ్చటి తీరాలు, ఒకవిధమైన శక్తి మరియు స్వచ్ఛమైన సహజ అందాన్ని అందినూ మీ కళ్లు ఎన్నటికీ అలసిపోని విధంగా చేస్తాయి. మృదువుగా సోకే సూర్యకాంతి, తాటితోపులు, గాలిలో గుసగుసలాడుతున్నట్లుగా మీకు స్వాగతం పలుకుతాయి. ఈ అద్భుతమైన దృశ్యం మీ జీవితకాలం మిమ్మల్ని అట్టిపెట్టుకొని ఉంటుందని మీకు తెలుసు.
తరువాత,వెళ్లే దోవలో నల్ పత్తిరమానల్ అనే చిన్న దీవిని చూడవచ్చు. బ్యాక్ వాటర్స్ మధ్య ఇది తేలుతూ ఉంటుంది. ఇక్కడ కాసేపు ఆగినట్లయితే,ఈ ప్రాంతానికి సంబంధించిన జనబాహుళ్యంలో ఉన్న అనేక అంశాలను మీతో పంచుకునేందుకు సిద్ధంగా ఉంటాడు. మీ ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే తరువాత మీరు ఆగే ప్రాంతం తన్నీర్‌ముఖం, ఇది ఉప్పునీటి అడ్డంకి గ్రామం, తన్నీర్ ముఖం కట్ట అని అంటారు. భారతదేశంలో అతి పెద్ద బురద నియంత్రణ కట్ట ఇది. ఈ ప్రాంతం గుండా ప్రయాణించడం మరియు అదేవిధంగా కేరళ వంటకాలను రుచిచూస్తూ ముందుకు సాగడం అనేది నిజంగానే ఒక మధురానుభూతి.
తరువాత మీ బ్యాక్ వాటర్స్ గమ్యస్థానం వైకం. వైకంలో మీరు ఆసక్తికమైన దృశ్యాలు మరియువారి జీవిత విధానాన్ని చూడవచ్చు. కేరళ యొక్క అద్భుత ప్రాచీన సంప్రదాయ ఆనవాళ్లను మీరు ఇక్కడ చూడవచ్చు. శివునికి అంకితం చేయబడ్డ దేవాలయం ఈ పట్టణంలో ప్రసిద్ధి. విశ్రాంతిని అందించే పచ్చని పొలాలుమరో ఆకర్షణగా చెప్పవచ్చు.
వైకం చేరుకున్న తరువాత నోరూరించే కేరళ భోజనం తరువాత మీరు కుంబలంగికి ప్రయాణించవచ్చు. మీరు తైక్కట్టుసెర్రిగుండా ప్రయాణిస్తారు. చుట్టూ కొబ్బరితోపులు మరియు వరి పొలాలతో ఉన్న ఈ చిన్న గ్రామం, బ్యాక్ వాటర్ జీవితానికి ఒక్కగా అద్దం బడుతుంది. కుంబలంగిలో ఉన్న చైనీస్ నెట్స్‌కు మీ స్వాగతం పలుకుతాయి. పోక్కాలి సాగు, అంటే ఇది ఒక సంప్రదాయ స్వదేశీ సాగువిధానం, ఇందులో వరిపంటల నుంచి రొయ్యలను వడపోత చేయడం జరుగుతుంది, కుంబలంగిలో మాత్రమే సాగుచేసే ప్రత్యేక విధానం ఇది.
కుంబలంగి బ్యాక్ వాటర్స్ చల్లగాలుల తరువాత మనం ఇప్పుడు ఎంతో చారిత్రిక ప్రాధాన్యత మరియు చైనీస్ చేపల వలలు ఉన్న ఫోర్టు కొచ్చికు వెళదాం. మీరు ఇష్టపడే ఈ ప్రదేశాలన్నింటికీ మీరు నడిచి వెళ్లవచ్చు. అయితే, లేదంటే మీరు పడవ పైనే ఉండి ఈ అందాలన్నింటినీ ఆస్వాదించవచ్చు. ఫోర్టు కొచ్చి స్మరించుకుంటూ మన తుది గమ్యస్థానం అయిన బోల్‌గట్టీ దీవులున మనం కదులుదాం.
బోల్‌గట్టి దీవులకు వెళ్లే దోవలో మీరు ఎర్నాకులం యొక్క అద్భుతమైన అందాలను చూడవచ్చు. బోల్‌గట్టి చేరుకున్న తరువాత, ఇక ముగించాల్సిన సమయం ఆసన్నమైంది. చల్లని గాలులను మదిలో నింపుకొని, వీడ్కోలు చెబుదాం. క్రూసీలో గడిపిన కొద్దిగంటల్లో మీరు ఆస్వాదించినది ఒక తీపి జ్ఞాపకం అని, తప్పకుండా ఇది కొన్ని జీవితాలపాటు మీ మదిలో ఉంటుంది.
డిస్ట్రిక్ట్ టూరిస్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (డిటిపిసి) ఫోన్: +91 477 2253308, 2251796 ఇమెయిల్: info@dtpcalappuzha.com
అక్కడకు చేరుకోవడందగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: అలప్పుర దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అలప్పుర నుంచి సుమారు 85 కిలోమీటర్లు
భౌగోళిక సమాచారంఆల్టిట్యూడ్: సముద్రమట్టం
మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.