గావి ఎకో టూరిజం అనేది, కేరళ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ యొక్క ప్రాజెక్ట్, ఇది ఇటీవల కాలంలో టూరిస్టుల యొక్క దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అనేకవిధాలుగా ప్రత్యేకమైనది, ఈ ప్రాజెక్ట్‌ని సందర్శించే అత్యధికులు ప్రకృతి ప్రేమికులు మరియు ఎడ్వంచరస్ టూరిస్టులు. ఇటీవల కాలంలో గావిని సందర్శించే సందర్శకులు సంఖ్య క్రమేపీ పెరుగుతుంది, మరిముఖ్యంగా ప్రపంచంలో ప్రసిద్ధ టూరిస్ట్ దిగ్గజం ‘అలిస్టెయిర్ ఇంటర్నేషన్’ దీనిని ప్రముఖ ఎకో టూరిస్ట్ కేంద్రాల్లో ఒకటిగాను మరియు భారతదేశంలో విధిగా చూడాల్సిన ప్రాంతంగా జోడించింది.
గావి ఎకో ప్రాజెక్ట్‌లో హైలైట్ అయిన విషయం ఏమిటంటే, గైడ్‌లు, గార్డెనర్‌లు మరియు కుక్‌లు వంటి పనులు చేయడానికి ఎక్కువగా స్థానికులు ఉంటారు. దీని వల్ల స్థానికుల జీవనోపాధి లభించడమే కాకుండా ప్రకృతి సంరక్షణపై అవగాహన కల్పించడానికి దోహదపడుతుంది. పత్తనంతిట్టి జిల్లాలో ఉండే గావి, సందర్శకులకు ట్రెకింగ్, వన్యప్రాణులను చూడటం, ప్రత్యేకంగా రూపొందించిన టెంట్‌ల్లో అవుట్‌డోర్ క్యాంపింగ్ మరియు నైట్ సఫారీలను అందిస్తుంది.
గావికి వెళ్లే తోవ అంతా కూడా టీ తోటలతో నిండి ఉంటుంది, ఇది ఒక తాజా అనుభూతిని అందిస్తుంది. గావికి వెళ్లే త్రోవలో మీరు ముండకాయం, కుట్టికన్నమ్, పీరమేడు వంటి ఆసక్తికరమైన ప్రదేశాలను చూడవచ్చు. వండిపెరియార్ నుంచి రోడ్డు గావీకి వెళుతుంది.
గావికి చేరుకున్న తరువాత అందమైన ఎకో లాడ్జ్ ‘గ్రీన్ మాన్షన్’ మీ కొరకు, తన పొదివిలో దాచుకునే తల్లిలా ఎదురు చూస్తుంటుంది. ‘గ్రాన్ మాన్షన్’ నుంచి, గావి లేక్ అదేవిధంగా దాని పక్కన ఉండే అడవులను వీక్షించవచ్చు. ‘గ్రీన్ మాన్షన్’లో లభించే బసతోపాటుగా దగ్గరల్లో ఉండే ట్రీ హౌసెస్ అలానే అడవుల్లోని టెంట్‌లను ప్రయత్నించవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ మరో మరపురాని అనుభూతి, శిక్షణ పొందిన స్థానికులు దీనిని పర్యవేక్షిస్తారు. ఒంటరిగా ప్రకృతిని ఆరాధించాలని అనుకునేవారికి లేదా చెరువుల్లో బోటింగ్‌కు వెళ్లాలని అనుకునేవారికి లేదా అద్భుతమైన సూర్యాస్తమయాన్ని ఆస్వాదించాలని అనుకునేవారికి ఇది అద్భుతమైన విడిది. సందర్శకులకు సాధారణంగా శాఖాహార ఆహారం మరియు అల్పాహారం ఇవ్వబడుతుంది, ఇది ఈ ప్రాంతానికి మరింత ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని జోడిస్తుంది.
ఈ ప్రాంతంలో ఎన్నో వృక్ష మరియు జంతు జాతులున్నాయి. కొండలు, లోయలు, ఉష్ణమండల అడవులు, విశాలమైన గడ్డి మైదానాలు, జలజల సాగే జలపాతాలు మరియు యాలకుల తోటలు ఎన్నో మీ మదిని దోచుకుంటాయి. గావి పరిసరాల్లో అరుదైన జాతులైన నీలగిరీ థార్ మరియు సింహం తోక ఉండే కోతులను చూడవచ్చు. గ్రేట్ పీడ్ హార్న్ బిల్, చెకుముకిపెట్టి మరియు వండ్రంగి పిట్టతో సహా ఇక్కడ 260కు పైగా వన్యప్రాణాలున్నాయి, పక్షులను చూడాలని అనుకునేవారికి గావి నిజంగానే ఒక స్వర్గం అని చెప్పవచ్చు.
గావి వద్ద ఉండే వ్యాలీ వ్యూ ద్వారా దిగువన లోతుగా ప్రవహించే నది మరియు అడవి యొక్క అద్భుత అందాలను వీక్షించవచ్చు. గ్రీన్ మాన్సన్ ఎకో లాడ్జ్ దగ్గర ఉండే కొచ్చు పంపా నుంచి ఎత్తైన కొండలపై మేసే నీటగిరీ థార్లు ట్రాక్ చేయవచ్చు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలకు గావి ద్వారా అతి తక్కువ దూరం ట్రెక్కింగ్ చేయడం ద్వారా చేరుకోవచ్చు. రాత్రిపూట వన్యప్రాణులను చూడాలని ఆసక్తి చూపించేవారికి కుల్లూరు, గావి పుళ్లుమేడు, కొచ్చు పంపా మరియు పచ్చకన్నంల్లో వన్యప్రాణులను చూడం కొరకు తగిన అవకాశాలుంటాయి.
గావి యొక్క మరో ప్రత్యేక ఫీచర్ అడవుల్లో క్యాంపింగ్. క్యాంపైంగ్ సైటులో టెంటుల్లో సైతం ఉండవచ్చు, ఇది అనేక భారతీయ అడవుల్లో అరుదుగా కనిపించే దృశ్యం. రాత్రి చీకటిలోనికి జారుకున్న తరువాత, మన చుట్టుపక్కల ఎన్నడో వన్యప్రాణులున్నాయనే అనుభూతి మాటల్లో వివరించలేనిది. ట్రీ టాప్ ఇళ్లు కూడా ఉన్నాయి, వీటిపై పక్షుల్లా హాయిగా గడపవచ్చు.
గావిలో గిరిజన తెగలవారు చురుగ్గా పాల్పంచుకోవడం వల్ల ఇది దేశంలోనే తనకుంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అడవులకు సంబంధించిన సంప్రదాయ అవగాహన మరియు వారి జీవన విధానం గావి మరియు దాని పరిసర ప్రాంతాలు ఇంకా దాని వాస్తవ స్థితిలో ఉండటానికి దోహదపడుతున్నాయి.
గావి ప్రతి ఒక్క సందర్శకుడికి ఒక వినూత్న అనుభూతిని అందిస్తుంది, జీవితకాలంలో మిస్ కాకూడదని స్థలం ఇది. గావి ఒక సహజ అందం, మరియు ఇది అడవికి సంబంధించినది, గావి అందాలను మరింత కాలం సహజంగా ఉంచడం కొరకు తాము చేపట్టే పనులు మరియు చర్యలు వారే బాధ్యులు అనే విషయాన్ని తెలియజేస్తుంది.
డిటిపిసి పత్తనంతిట్ట ద్వారా అందించే గావి ప్యాకేజీ, ఇక్కడ క్లిక్ చేయండి.
దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: కొట్టాయం, సుమారు 114 కిలోమీటర్లు దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: మధురై ఎయిర్‌పోర్ట్ (తమిళనాడు), సుమారు 140 కిలోమీటర్లు మరియు కొచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, సుమారు 190 కిమీ
లొకేషన్ఆకాంక్షాలు: 9.437208, రేఖాంశాలు: 77.166066
మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.