కోవలం పక్కపక్కనే మూడు చంద్రకారంలో ఉన్న బీచ్‌లను కలిగిన అంతర్జాతీయ ప్రసిద్ధిగాంచిన బీచ్. 1930 నుంచి మరిముఖ్యంగా యూరోపియన్ పర్యాటకు ఇది అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాంతంగా నిలుస్తోంది. బీచ్‌లోని ఒక పెద్ద రాతి గుట్ట, సన్ బాతింగ్‌కు అనువైన అద్భుతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
బీచ్‌లో ఇంటువంటి విశ్రాంతి ఆప్షన్లు మనకు ఎన్నో కనిపిస్తాయి. సన్ బాతింగ్, ఈత, హెర్బల్ బాడీ టోనింగ్ మసాజ్‌లు, ప్రత్యేక సాంస్కృతిక కార్యమ్రాలు మరియు కాటమరాన్ క్రూసింగ్‌వీటిలో కొన్ని. ఉష్ణమండల సూర్యుడు, కొన్ని నిమషాల్లోనే చర్మంపై ఒక మందమైన పొరను ఏర్పరుస్తాడు. బీచ్‌లో జీవితం మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది., ఇది రాత్రికూడా కొనసాగుతుంది. బీచ్ కాంప్లెక్స్‌లో బడ్జెట్ కాటేజీలు, ఆయుర్వేద హెల్త్ రిసార్ట్‌లు,కన్వెన్షన్ సదుపాయాలు,షాపింగ్ జోన్‌లు, స్విమ్మింగ్ పూల్స్, యోగా మరియు ఆయుర్వేద మసాజ్ సెంటర్లు ఉన్నాయి.
కోవలం వద్ద టూరిస్ట్‌ల కొరకు నివాస సదుపాయాలు ఫైవ్ స్టార్ హోటల్స్ నుంచి బడ్జెట్ హోటల్స్ వరకు ఉంటాయి మరియు రెస్టారెంట్లు మరియు కెఫటేరియాల్లో లభించే ఆహార ఎంపికలు కాంటినెంటల్ వెరైటీల నుంచి సౌత్ ఇండియా వంటకాల వరకు ఉంటాయి.
కేరళ రాజధాని అయిన తిరువనంతపురం, కోవలం నుంచి కేవలం 16కిలోమీటర్ల దూరంలో ఉన్నది, ఇక్కడకు పెద్దగా ఇబ్బంది పడకుండా చేరుకోవచ్చు. అయితే సెలవు రోజుల్లో కోవలంలో ఉండి,సిటీని సందర్శిస్తే బాగుంటుంది.
తిరువనంతపురం నగరంలో, నేపియర్ మ్యూజియం, శ్రీ చిత్ర ఆర్ట్స్ గ్యాలరీ, పద్మనాభ స్వామి దేవాలయం వంటి ఆసక్తికరమైన ప్రదేశాలున్నాయి ఎస్‌ఎమ్‌ఎస్‌ఎమ్ ఇనిస్టిట్యూట్,రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హస్తకళల ఎంపోరియం, ఎథినిక్ క్యూరిస్ మరియు ఇతర ఆర్టికల్స్‌ను ఇక్కడ నుంచి కొనుగోలు చేయవచ్చు.
దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: తిరువనంతపురం సెంట్రల్, సుమారు 16 కిమీ దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది
లొకేషన్ఆకాంక్షాలు: 8.402074, రేఖాంశాలు: 76.978426
భౌగోళిక సమాచారంసందర్శించడానికి అత్యుత్తమ సమయం సెప్టెంబర్ నుంచి మార్చి ఆల్టిట్యూడ్: సముద్రమట్టం
మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.