మున్నార్, మూతిరపుళా, నల్లతన్ని మరియు కుండాల అనే మూడు పర్వతా వాగులు సంగమంలోఉన్నది. సముద్ర మట్టానికి 1600మీటర్ల ఎత్తులో ఉన్న మున్నార్ ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలకులు దక్షిణ భారతదేశంలో వేసవి రిసార్ట్. విశాలమైన టీ తోటలు, అందమైన పట్టనాలు, వైండింగ్ లైన్‌లు మరియు హాలిడే సదుపాయాలు దీనిని ఒక ప్రముఖ రిసార్ట్ టౌన్‌గా మార్చాయి. ఈ అడవులు మరియు గడ్డిమైదానాల్లో కనిపించే అద్భుతమైన పుష్ప సంపదలో నీలకురింజి ఒకటి. ఈ పువ్వు ఈ కొండల్లో 12 సంవత్సరాలకు ఒక్కసారి అంటే 2018లో మళ్లీ పూస్తుంది. మున్నారులో దక్షిణభారతదేశంలోనే అతి ఎత్తైన పర్వతశిఖర, ఆనముడి ఉంది, దీని ఎత్తు 2,695మీ. ఆనముడి ట్రెక్కింగ్‌కు ఎంతో అనకూలమైనది.
టూరిస్టులు మున్నార్ హిల్ స్టేషన్‌లో ఉండే అందాల ఆస్వాదించడం కొరకు మున్నారు చుట్టుపక్కల ఉండే కొన్ని ముఖ్యమైన కేంద్రాలను మనం ఇప్పుడు చూద్దాం.
మున్నారు పక్కన ప్రధాన ఆకర్షణ ఎరవికులం నేషనల్ పార్క్ అని చెప్పవచ్చు. ఇది అంతరించిపోతున్న నీలగిరి తార్‌కు ఫేమస్. 97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కు అనేక రకాల అరుదైన సీతాకోక చిలుకలు, జంతువు మరియు పక్షులకు కేంద్రం. ఇది ట్రెక్కింగ్‌కు గొప్పస్థలం, పార్కులో నుంచి టీతోలు, ఆపై తుషార బిందువుల దుప్పటిని కప్పుకున్న కొండల యొక్క అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. నీలకురింజి పుష్పం ఈ పర్వత సానువుల్లో విరబూసినప్పుడు, పర్వతాలు నీలం దుప్పటి కప్పుకున్నట్లుగా ఉన్నప్పుడు, ఈ పర్వతం పర్యాటకులు ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు తరలి వస్తారు. పశ్చిమ కనుమలకు చెందిన ఈ పుష్పం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పుష్పిస్తుంది.
ఆనముడి పర్వతశిఖరంఎరవికులం నేషనల్ పార్కులోపల ఉన్నది ఆనముడి పర్వతశిఖరం. దక్షిణ భారతదేశంలోనే ఇది అతి పెద్ద పర్వతశిఖరం, ఇది సుమారు 2700 మీటర్ల ఎత్తున ఉన్నది. ఈ పర్వతశిఖంపై ట్రెక్కింగ్ చేయడానికి ఎరవికులంలోని ఫారెస్ట్ మరియు వన్య సంరక్షణ అధికారుల యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
మట్టుపెట్టిసందర్శకుల దృష్టిని ఆకర్షించే మరో ఆసక్తికర ప్రదేశం, మున్నారు పట్టణం నుంచి 13కిలోమీటర్ల దూరంలో ఉన్న మట్టుపెట్టి. ఇది సముద్రమట్టానికి 1700మీటర్ల ఎత్తులో ఉన్నది, మట్టుపెట్టి స్టోరేజీ డ్యామ్ మరియు అందమైన చెరువు ఉన్నాయి. ఇందులో అద్భుతమైన బోటు రైడిరగ్‌కు అనుమతిస్తారు, పక్కన ఉన్న కొండలు మరియు లాండ్ స్కేప్‌లను ఆస్వాదించవచ్చు. మట్టుపెట్టిలో నడపబడే ఇండో స్విస్ లైవ్ స్టాక్ ప్రాజెక్ట్ కింద నడపబడే డైరీ ఫాం ఎంతో ప్రముఖమైనది, ఇక్కడ అత్యంత దిగుబడి ఇచ్చే ఆవుల్లో చూడవచ్చు.
పల్లివాసల్పల్లివాసల్, ఇది మున్నారు నుంచి చిత్తిరపురం నుంచి 3కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది కేరళలోని మొదటి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్‌కు వేదిక. ఇది అద్భుతమైన దృశ్య సౌందర్యానికి కేంద్రం మరియు సందర్శకులు దీన్ని ఒక ప్రముఖ పిక్నిక్‌కేంద్రంగా పరిగణిస్తున్నారు.
చిన్నకనాల్ మరియు ఆనయీరంగల్మున్నారుకు దగ్గరల్లో చిన్నకనాల్ ఉంటుంది మరియు ఇక్కడ ఉండే వాటర్ ఫాల్స్‌ను పవర్ హౌస్ వాటర్ ఫాల్స్ అని అంటారు. ఇక్కడ నిట్టనిలువుగా ఉండే రాళ్లు సముద్ర మట్టానికి 2000మీటర్ల ఎత్తుగా ఉంది. ఈ ప్రదేశం, పశ్చిమఘాట్ శ్రేణిలోని అందమైన దృశ్యాలకు కేంద్రంగా ఉంటుంది. చిన్నకనాల్ నుంచి ఏడు కిలోమీటర్ల ప్రయాణిస్తే మీరు ఆనయీరంగల్ చేరుకుంటారు. మున్నార్ నుంచి 22కిలోమీటర్ల దూరంలో ఉండే ఆనయీరంగల్, టీ తోటలతో పచ్చనికార్పెట్‌లా ఉంటుంది. అద్భుతమైన రిజర్వాయర్‌పై ట్రిప్పు ఒక మరపురాని అనుభూతిని మిగిలిస్తుంది. ఆనయీరంగల్ డ్యామ్ చుట్టుపక్కల టీ తోటలు మరియు పచ్చని అడవులుంటాయి.
టాప్ స్టేషన్టాప్ స్టేషన్, మున్నారు నుంచి 3కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మున్నార్- కొడైకనాల్ రోడ్డులో ఇది గరిష్ట స్థానం. మున్నారును సందర్శించే సందర్శకులు తప్పనిసరిగా టాప్ స్టేషన్‌ను సందర్శించాల్సిందే. ఇక్కడ నుంచి పొరుగున్న తమిళనాడు రాష్ట్రం యొక్క అందాలను ఆస్వాదించవచ్చు. ఎంతో విశాలమైనప్రాంతంలో విరబూసే నీలకురింజి పుష్పాలను చూడటం కోసం మున్నారులో ఇది ఎంతో అనుకూలమైన ప్రదేశం.
టీ మ్యూజియంటీ తోటల ఆవిర్భావం మరియు వృద్ధికి సంబంధించి మున్నారుకు ఘనమైన పూర్వ చరిత్రే ఉన్నది. ఈ పూర్వ చరిత్రను సంరక్షించడం కోసం మరియు కేరళ గరిష్ట ఎత్తుల్లో సాగించే టీ తోగల సాగులోని ఆసక్తికరమైన అంశాలను ప్రపంచవానికి తెలియచేయడం కోసం మున్నారులో టాటా టీ ద్వారా టీ కొరకు ప్రత్యేకమైన ఒక మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ టీ మ్యూజియంలో అనేక ఆసక్తికరమైన వస్తువులు, ఫోటోగ్రాఫ్‌లు మరియు యంత్రాలున్నాయి. ఇవీన్న కూడా మున్నారు ప్రాంతంలో టీ తోటల యొక్క అభివృద్ధికిసంబంధించి మనకు అనేక కథలు చెబుతాయి. మున్నారులోని టాటా టీకి చెందిన నల్లతన్ని ఎస్టేటులో ఉన్న ఈ మ్యూజియంను తప్పక సందర్శించాల్సిందే.
అక్కడకు చేరుకోవడందగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: అలువా సుమారు 108 కిలోమీటర్లు మరియు అంగమలి, సుమారు 109 కిలోమీటర్లు దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: కొచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అలువా- మున్నార్ రోడ్డు ద్వారా, సుమారు 108 కిలోమీటర్లు
లొకేషన్అక్షాంశాలు: 10.091234, రేఖాంశాలు: 77.060051
భౌగోళిక సమాచారంవర్షపాతం: 275 cm చొప్పున
మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.