పాలక్కాడు జిల్లాలోని నెన్‌మారా పట్టణం నుంచి ఆకాశంలోని మేఘాలు చీల్చుకుంటూ కనిపించే నెల్లియంపథి పర్వతశ్రేణి కనిపిస్తుంది. ఈ పర్వతాల యొక్క ఎత్తు 467 మీటర్ల నుంచి 1572 మీటర్ల వరకు ఉంటుంది. ది దీనిని వీక్షించేవారికి అద్భుతమైన ప్రశాంతతను అందిస్తుంది. నెల్లియంపథిని చేరుకోవడానికి నెన్‌మారా నుంచి పోతుండి డ్యామ్ వరకు వెళ్లే రోడ్డుపై ప్రయాణించాలి. అక్కడ నుంచి 10 మలుపులు తిరిగితే నెల్లియంపథి చేరుకుంటారు.
పోతుండి డ్యామ్ అద్భుతమైన దృశ్య కావ్యం, ఇది ఒక చక్కటి పిక్నిక్ స్థలం, ఇక్కడ నుంచి చక్కటి బోటింగ్ సదుపాయం ఉంటుంది. ఘాట్ రోడ్డుపై నెల్లియంపథి వెళ్లేటప్పుడు, భారీగా గాలి వీస్తుంటుంది. వివిధ ప్రాంతాల్లో ఉండే వ్యూ పాయింట్ల ద్వారా పాలక్కాడు జిల్లాలో ఉండే, పచ్చని వరిపొలాలు చక్కటి దృశ్యకావ్యంగా మదిలో నిలుస్తుంది. ఇక్కడ నుంచి పాలక్కాడ్ గ్యాప్‌ను గమనించవచ్చు. పాలక్కాడ్ గ్యాప్ నుంచే పశ్చిమ కనుమలు ప్రారంభమయ్యాయని భౌగోళిక పరిశోధన భావన, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి పొరుగున ఉన్న తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు సైతం వీక్షించవచ్చు.
ఇంకా పైకి వెళ్లినట్లయితే బయో ఫార్మింగ్‌ను చూడవచ్చు, వీటిని ప్రయివేటు సంస్థలు నిర్వహిస్తుంటాయి. అదేవిధంగా వివిధ ప్లానిటేషన్ కంపెనీల ద్వారా టీ ఎస్టేట్‌లు నిర్వహించబడుతూ ఉంటాయి. నెల్లియంపథి కొండలు ఆరెంజ్‌ల సాగుకు ప్రసిద్ధి.
ప్రయివేటు యాజమాన్యాల ద్వారా నిర్వహించే హోటళ్లు మరియు రిసార్టులు నెల్లియంపథి వెళ్లే దారిలో ఉన్నాయి. అత్యంత ఎత్తైన బిందువు వద్ద ఉన్న పాలగాపాండీ ఎస్టేట్‌ను చేరుకోవడానికి ముందు వచ్చే బయోఫామ్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ ఎస్టేట్ ఒక పెద్ద బంగ్లా, బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించే సమయంలో ఈ ఎస్టేట్ నిర్మించారు. ఇప్పుడు ప్రయివేటువ్యక్తుల ద్వారా నిర్వహించబడే ఎస్టేట్‌గా దీన్ని మార్చారు. కైకాట్టి వద్ద కమ్యూనిటీ హాల్ ఉన్నది, ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు దీన్ని తమ బేస్‌గా ఉపయోగించుకుంటూ ఉంటారు.
పాలగాపాండీకి కాస్తంత దూరంలో సీతార్కుండు ఉంటుంది, ఇది అద్భుతమైన వ్యాలీ వ్యూ ఇక్కడ నుంచి లభిస్తుంది. 100మీటర్ల ఎత్తు నుంచి పడే వాటర్‌ఫాల్స్ అదనపు ఆకర్షణను కలిగిస్తాయి. పాలగాపాండీ నుంచి ట్రెక్కింగ్ ద్వారా లేదా జీపు ద్వారా మాంపారాకు చేరుకోవచ్చు, ఇది నెల్లియంపథి పోయే మార్గంలో ఉండే మరో అద్భుతమైన స్థలం ఇది. పాలగాపాండీ ఎస్టేట్‌కు సమీపంలో టీ, ఏలకులు మరియు కాఫీ తోటలున్నాయి. పక్కనున్న కొండల్లో ఇండియాన్ గౌర్, ఏనుగులు, చిరుతలు, పెద్ద ఉడుతలు వంటిని చూసేందుకు అవకాశం కల్పిస్తుంది. పక్షులకు చూసేవారికి ఇది అద్బుతమైన స్వర్గం.
దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: పాలక్కాడ్, సుమారు 56 కిమి: త్రిసూర్ మరియు షోరనూన్: సుమారు 77కిమి దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (తమిళనాడు), పాలక్కాడ్ నుంచి సుమారు 55 కిలోమీటర్లు
లొకేషన్అక్షాంశాలు: 10.538952, రేఖాంశాలు: 76.69364
మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.