తేక్కడి అనే పేరు వినిపించగానే మనకు ఏనుగులు,విడిపోయే కొండల వరసలు మరియు సుగంధ ద్రవ్యాల వాసనలు విరజిమ్మే తోటలు మనకు గుర్తుకు వస్తాయి. పెరియార్ అడవి, భారతదేశంలో ఉన్న అత్యుద్భుతమైన వన్య సంరక్షణ కేంద్రాల్లో ఒకటి, ఇది జిల్లా మొత్తం విస్తరించింది ఉంది. అందమైన తోటలు మరియు పర్వత పట్టణాలు , ట్రెక్కింగ్ మరియు మౌంటైన్ వాక్‌కు ఎంతో అనుకూలమైనవి.
పెరియార్ అడువుల యొక్క సంపద
పుష్పసంపద: మొత్తం 1965 పుష్పించే మొక్కల్లో 171 గడ్డి రకాలు, 143 ఆర్కిడ్ రకాలు ఉన్నాయి. కేవలం దక్షిణ భారతదేశ కోనిఫెరస్, లేదా సాంకేతికగా పోడోకార్పస్ వలిచైనస్‌లు అని పిలిచే రకాలు కేవలం పెరియార్ టైగర్ రిజర్వ్‌లోని అడుగుల్లో మాత్రమే పెరుగుతాయి.
జంతు సంపద:
క్షీరదాలు ఆసియా ఏనుగు, బెంగాల్ టైగర్, భారతీయ ఎద్దు, సాంబర్ డీర్, ఇండియన్ వైల్డ్ డాగ్, తాచుపాము, మొరిగే జింక మరియు పెరియార్ లేక్‌లో బోట్ క్రూసీ సమయంలో కనిపించే స్మూత్ కోటెడ్ ఒట్టర్‌లతో సహా 60కు పైగా జాతులను దీనిలో గమనించవచ్చు. నీలగిరి థార్ అనేది అత్యంత ఎత్తైన రాతి ప్రాంతాలకు పరిమితం అవుతుంది, అలానే అరుదైన సింహం తోక కలిగిన కోతులు కూడా సతతహరిత అడువుల లోపల కనిపిస్తాయి. బానెట్ కోతి మరియు నీలగిరీ లాంగర్‌లు రెండింటిని కూడా బోట్ ఆగే చోట ఉండే చెట్లపై నుంచి చూడవచ్చు.
పక్షులు : ఇక్కడకు 265కు పైగా జాతులు వలస వస్తాయి. మలబార్ గ్రే హార్న్ బిల్, ఇంయన్ పైడ్ హార్న్‌బిల్, వైట్ బిల్డ్ ట్రెప్పీ, డ్రాగోస్ యొక్క అనేక జాతులు, చెకుముకి పిట్టలు, ప్లే క్యాచర్‌లు, బాబర్స్, అద్భుతమైన మలబార్ ట్రోగాన్ మొదలైనవాటిని దగ్గరల్లో ఉండే బోట్ ల్యాండ్‌ల ద్వారా చూడవచ్చు.
సరీసృపాలు : కోబ్రా, తాచుపాము, కట్లపాము, విషం లేని అనేక పాములు మరియు మానిటర్ బల్లి
ఉభయచరాలు: కప్పలు, గోదురులతోపాటు రంగురంగుల మలబార్ గ్లైడింగ్ కప్ప, కామన్ ఇండియన్ చిరుకప్పు,ఫన్‌గోయిడ్ కప్ప మరియు రెండు రంగుల్లో ఉండే కప్ప
పైకస్(చేప): పెరియర్ వాగులు, వంకల్లో అనేకక రకాల జాతుల చేపలు కనిపిస్తాయి. ముషేర్, అదృశ్యమైపోతున్న భారతదేశ గేమ్‌ఫిష్ వంటివి ఉంటాయి. స్మూత్ కోటెడ్ వోట్టర్‌ని బోట్లలో ప్రయాణించేటప్పుడు దీన్నిగమనించవచ్చు.
తోటలు: తోటలు, టీ, ఏలకులు, మిరియాలుచ కాఫీ తోటలు పెరియార్ వన్య సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్నాయి.
సందర్శన టవర్లు: పెరియార్ టైగర్ రిజర్వ్‌లో అనేక వాచ్ టవర్లు ఉంటాయి. ఇక్కడ నుంచి వన్యప్రాణులను మీరు చూడవచ్చు. ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, తెక్కడిలో మీరు రిజర్వేషన్లు చేసుకోవచ్చు ఫోన్: ++ 91- 4869 - 222027
పెరియార్‌లో టూరిజం కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడం కొరకు, ఇక్కడ క్లిక్ చేయండి: పెరియార్ వద్ద టైగర్ రిజర్వ్
ఫీల్డ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్ టైగర్) ఆఫీస్ ఆఫ్ ద ఫీల్డ్ డైరెక్టర్ ఎస్.హెచ్ మౌంట్, కొట్టాయం కేరళ, ఇండియా - 686 006 టెలి: +91 481 2311740 ఇమెయిల్:fd@periyartigerreserve.org వెబ్‌సైట్: www.periyartigerreserve.org డిప్యూటీ డైరెక్టర్ (పెరియార్ ఈస్ట్) పెరియార్ టైగర్ రిజర్వ్ తేక్కడి కేరళ, ఇండియా - 685 536 టెలి: +91 4869 222027 ఇమెయిల్: dd@periyartigerreserve.org
అక్కడకు చేరుకోవడందగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: కొట్టాయం రైల్వే స్టేషన్, తేక్కడి నుంచి సుమారు 110కిమి దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: మధురై, సుమారు 140 కిమి మరియు కొచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, తేక్కడి నుంచి సుమారు 190 కిమి
లొకేషన్అక్షాంశాలు: 9.4679, రేఖాంశాలు: 77.143328
భౌగోళిక సమాచారంవర్షపాతం: 25 cm చొప్పున
మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.