సైలెంట్ వాలీ నేషనల్ పార్కు 237.52 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాలక్కాడ్ జిల్లాలోని ఈశాన్య కొనలో ఉన్నది. ఇది ఆకస్మికంగా నీలగిరీ పీఠభూమిలో ఉత్తర ప్రాంతంలోను అదేవిధంగా దక్షిణాన మన్నారక్కాడ్‌లోను ఇది విస్తరించి ఉంటుంది. ఎంతో సున్నితమైన మరియు ప్రత్యేక ఉష్ణమండల సతతహరిత వర్షాధారిత అడవులు, అనేక రకాల జంతువృక్షజాతులను గమనించవచ్చు. ఇటువంటి వాటిని ప్రపంచంలో మరెక్కడా గమనించలేరు.
సైలెంట్ వాలీ నేషనల్ పార్క్ ఇది నీలగిరీ బయోస్ఫియర్ రిజర్వాయర్. దీని పేరుకు తగ్గట్టుగా సైలెంట్ వాలీ భారీ జీవవైవిధ్యానికి వేదికగా నిలుస్తుంది. జీవశాస్త్రం చదివే విద్యార్థులు, ప్రొఫెషనల్ సైంటిస్టులు మరియు ఫీల్డ్ బయాలజిస్టులకు ఇది నిజంగానే ఒక స్వర్గంలంటిది.
పశ్చిమ కనుమల్లో ఇలాంటి జీవవైవిధ్యాన్ని ఒకే ప్రాంతంలో మరెక్కడా మీరు చూడలేరు. సుమారు 1000కు పైగా పుష్పించే మొక్కలజాతులు, వీటిలో 110 జాతుల ఆర్కిడ్స్, 34 జాతుల క్షీరదాలు, 200 రకాల శీతాకోకచిలుకలు, 400 రకాల మిడతలు, 128 రకాల బీటెల్స్ల వీటిలో 10 సైన్సుకు కొత్తగా పరిచయం చేయబడినవి మరియు దక్షిణ భారతదేశానికే పరిమితం అయిన 16 జాతులకు చెందిన పక్షులతో సహా 150 పక్షులు కూడా ఉన్నాయి.
నీలగిరీ కొండల్లో ఉద్భవించే కుంతీ నది, సముద్ర మట్టంలో 2000 మీటర్ల ఎత్తున ప్రవహించే ఈ నది, లోయ మొత్తం ప్రవహిస్తుంది, ఇది దట్టమైన అడవుల గుండా ముందుకు సాగుతుంది. కుంతీ నది ఎన్నటికీ బూడిద రంగులోకి మారదు, దీని నీళ్లు ఎప్పుడు కూడా ఎంతో తెల్లగా, స్పటికంగా ఉంటాయి.
మిగిలిన ఏ ఉపరితలంతో పోల్చినా, ఈ అడవుల యొక్క నుంచి నీరు ఆవిరి కావడం ఎక్కువగా ఉంటుంది. ఇది వాతావరణాన్ని చల్లబరుస్తుంది,నీటి ఆవిరి సంక్షేపణం కావడం తేలికవుతుంది, ఇది వేసవికాలంలో వర్షాలు పడేందుకు కారణం అవుతుంది.
వైల్డ్ లైఫ్ గార్డెన్ సైలెంట్ వ్యాలీ డివిజన్ మన్నారక్కాడ్ పోస్ట్, పాలక్కాడ్, కేరళ, ఇండియా - 678582 ఫోన్: +91 4924 222056 ఇమెయిల్: ww-svnp@forest.kerala.gov.in
మరింత సమాచారం కొరకు, దయచేసి సంప్రదించండి, ఇన్ఫర్మేషన్ సెంటర్: + 91 8589895652 వెబ్‌సైట్: www.silentvalley.gov.in
అసిస్టెంట్ వైల్డ్ లైఫ్ గార్డెన్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు, ముక్కాలి, పాలక్కాడ్- 678582 ఫోన్: +91 4924 253225 ఇమెయిల్: ro-mukkali@forest.kerala.gov.in
అక్కడకు చేరుకోవడందగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: పాలక్కాడ్, సుమారు 69 కిలోమీటర్ల దూరంలో దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (తమిళనాడు ), సుమారు 91 కిలోమీటర్లు
లొకేషన్అక్షాంశాలు: 11.130066, రేఖాంశాలు: 76.42911
మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.