లొకేషన్: తిరువనంతపురానికి ఉత్తరానికి 51కిలోమీటర్లు మరియు కొల్లానికి దక్షిణాన 37కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి.
వర్కల, ఎంతో ప్రశాంతంగా ఉండే చిన్న గ్రామం, ఇది తిరువనంతపురం శివార్లలో ఉంటుంది. అద్భుతైన బీచ్,2000 సంవత్సరాల నాటి విష్ణు దేవాలయం మరియు ఆశ్రమం మరియు బీచ్‌కు కాస్తంతదూరంలో ఉండే శివగిరి మఠం ప్రముఖ ప్రదేశాలుగా పేర్కొనవచ్చు.
పాపనాశం బీచ్ (దీనిని వర్కల బీచ్) అని అంటారు, ఇది వర్కలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇది సహజ స్ప్రింగ్‌కు ప్రసిద్ధి. దీనిలో ఔషధ మరియు నివారణ లక్షణాలున్నాయని భావిస్తారు. ఈ బీచ్‌లోని పవిత్ర జలాల్లో స్నాం చేయడం ద్వారా శరీరం మరియు మనస్సులో ఉన్న మలినాలు, పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు, అందుకే దీన్ని పాపనాశం బీచ్ అని అంటారు.
2000 సంవత్సరాల నాటి జనార్దన స్వామి దేవాలయం ,బీచ్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది. హిందూ సంస్కర్త మరియు తాత్త్వికవేత్త అయిన శ్రీ నారాయణ గురు(1856- 1928) ద్వారా శివగిరి మటం కూడా దీనికి దగ్గరలో ఉంటుంది. నారాయణ గురు సమాధిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 30 నుంచి జనవరి 1వరకు వేలమంది సందర్శించుకుంటారు. శ్రీ నారాయణ గురు ఈ సిద్ధాంతానికి ప్రచారం కల్పించాడు: ‘‘ ఒక కులం, ఒక మతం మరియు ఒక దేవుడు’’, వర్ణ వ్యవస్థతో విడిపోయిన సమాజం కట్టుబాట్లను చేధించడం.
వర్కలలో టూరిస్టులకు అద్భుతమైన నివాస సదుపాయాలు లభిస్తాయి. ఇక్కడ అనేక ఆయుర్వేదిక మసాజ్‌కేంద్రాలున్నాయి.
ఆకర్షణలు: బీచ్, మినరల్ వాటర్ స్ప్రింగ్స్, శివగంగ మఠం మరియు 2000 సంవత్సరాల నాటి విష్ణు దేవాలయం
వర్కల గురించి మరింత చదవండి.
దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: వర్కల, సుమారు 3 కిలోమీటర్ల దూరం దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 57 కిలోమీటర్ల దూరంలో ఉంది
లొకేషన్అక్షాంశాలు: 8.740543, రేఖాంశాలు: 76.716785
మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.