వాయనాడ్ యొక్క ఉత్తర జిల్లాల్లోని మొదటి నాలుగు ట్రయిల్స్ లేదా కాలిబాటలు వాయనాడ్ టూరిజం ఆర్గనైజేషన్ (డబ్ల్యుటివో) ద్వారా సంరక్షించబడి, ప్రోత్సహించబడుతున్నాయి, ఇది వాయనాడ్‌లో ‘బాధ్యతాయుతమైన మరియు ధారణీయ టూరిజం’ సంస్కృతిని పెంచి పోషించడంలో ఇది ఒక కీలకపాత్రను పోషిస్తుంది.
నాలుగు ట్రయిల్స్‌లో, మొదటి ‘అవుట్‌డోర్ ట్రయిల్’ని పరిచయం చేయాలని అనుకుంటున్నాం, ఇది వాయనాడ్ జిల్లాలోని దిగువ లొకేషన్‌లను కవర్ చేస్తుంది.
2100 మీటర్ల ఎత్తు వద్ద, వాయనాడ్ దక్షిణ ప్రాంతంలో మెప్పాడి వద్ద అతి ఎత్తైన చెంబ్రా పర్వతశిఖం ఉన్నది. ఈ ప్రాంతంలో అన్నింటి కంటే ఎత్తైన శిఖరం ఇది మరియు ఈ శిఖరాన్నిఎక్కడం ఎంతో క్లిష్టమైన అంశం. చెంబ్రా పర్వతాన్ని ఎక్కడ నిజంగా ఒక మరపురాని అనుభవం, ప్రతి దశలోనూ వాయినాడ్ యొక్క అందాలు మన ముందు ఆవిష్కృతం అవుతాయి. శిఖరం పైకి వెళ్లి, కిందకు రావడానికి ఒక్కరోజు సమయం పడుతుంది. శిఖరంపై క్యాంప్ వేయాలనుకునేవారికి ఒక మరపురాని అనుభూతి మిగులుతుంది. ఎవరైతే క్యాంప్ వేయాలని అనుకుంటారో, వారు వాయనాడ్‌లోని కాల్‌పెట్టాలో ఉన్న డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్‌ను సంప్రదించవచ్చు.
నీలిమలవాయనాడ్లోని దక్షిణ తూర్పు ప్రాంతంలో ఉన్నది, కాల్‌పెట్టా నుంచినే కాకుండా సుల్తాన్ బతేరి నుంచి కూడా ఇక్కడకు చేరుకోవచ్చు, నీలిమల ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలమైనది. ట్రెక్కింగ్‌కు వివిధ రకాల ట్రెక్కింగ్ మార్గాలను ఎంచుకోవచ్చు. నీలిమల పై నుంచి మీన్‌ముట్టి జలపాతాలను చూడటం ఒక మరుపురాని అనుభూతిని మిగిలిస్తుంది.
మీన్‌ముట్టి జలపాతాలునీలిమలపర్వతానికి అతి దగ్గరలో ఉన్న అద్భుతమైన మీన్‌ముట్టి జలపాతాలను ఊటీ మరియు వాయినాడ్‌ను కలిపే మెయిన్ రోడ్డు నుంచి 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయడం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. వాయనాడ్ జిల్లాలో ఇది అతి పెద్ద వాటర్‌ఫాల్స్, ఇక్కడ నీళ్లు సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి పడతాయి.
చేతాలయంవాయనాడ్ జిల్లాలో సందర్శకులను ఆకర్షించే మరో జలపాతాలు చేతాలయం జలపాతాలు, వాయనాడ్‌కు ఉత్తర ప్రాంతంలో ఉండే సుల్తాన్ బతేరికు దగ్గరగా ఉంటాయి. మీన్‌ముట్టితో పోలిస్తే ఈ జలపాతాలు ఎంతో చిన్నవి. ఈ ఫాల్స్ మరియు వీటి పరిసరాల్లో ఉండే ప్రాంతాలు ట్రెక్కింగ్‌కు మరియు పక్షులను సందర్శించేవారికి ఎంతో అనుకూలమైనవి.
పక్షిపథాలంపక్షిపథాలం అనేది సుమారు 1700మీటర్ల ఎత్తున బ్రహ్మగిరి హిల్స్‌లోని అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా పెద్దపెద్ద బండరాళ్లు ఉంటాయి, ఇవి నిజంగానే ఎంతో పెద్దవిగా ఉంటుంది. ఇక్కడ ఉండే లోతైన గుహలు వివిధ రకాల పక్షులు, జంతువులు మరియు అరుదైన మొక్కలకు కేంద్రం. పక్షిపథాలం మనంతవాడీకి దగ్గరల్లో ఉంటుంది మరియు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి అడవిలో తిరునెల్లి నుంచి సుమారు 7కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. పక్షిపథాలానికి చేరుకునే సందర్శకులు డిఎఫ్‌వో ` ఉత్తర వాయనాడ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
బనాసురా సాగర్ డ్యామ్భారతదేశంలో అతి పెద్ద ఎర్త్ డ్యామ్‌గా ఇది పరిగణించబడుతుంది. ఈ డ్యామ్ వాయనాడ్‌లోని దక్షిణ పశ్చిమ ప్రాంతంలో కరలాడ్ సరస్సుకు దగ్గరగా ఉంది. బన్నాసురా సాగర్ డ్యామ్ యొక్క ప్రాజెక్ట్ ప్రాంతం, బన్నాసురా పర్వతశిఖరానికి ట్రెక్కింగ్ ప్రారంభ స్థానం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను ముంచివేయడం వల్ల కొన్ని దీవులు ఏర్పడ్డాయి. వాయనాడ్ యొక్క స్థలాలు, ధ్వనులు మరియు సువాసనలు మదిలో నింపుకున్న తరువాత, మీరు వాయనాడ్‌లోని సుగంధ ద్రవ్యాలు, కాఫీ,టీ, వెదురు ఉత్పత్తులు, తేనె మరియు వనమూలికల మొక్కల్ని కొనుగోలు చేయవచ్చు.
వాయనాడ్‌లో ‘ అవుట్‌డోర్ ట్రయిల్’ మీద మరిన్ని వివరాల కోసం వాయనాడ్ టూరిజం ఆర్గనైజేషన్‌కు టచ్‌లో ఉండండి.
సంప్రదించు వివరాలుప్రధాన కార్యదర్శి వాయనాడ్ టూరిజం సంస్థ వాసుదేవ ఎడోమ్, పోళుతన పోస్టు, వాయనాడ్, కేరళ, ఇండియా పిన్ - 673575 టెలి. +91-4936-255308, ఫ్యాక్స్.+91-4936-227341 ఇమెయిల్: mail@wayanad.org
అక్కడకు చేరుకోవడందగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: క్యాలికట్ రైల్వేస్టేసన్ 62 కిలోమీటర్ల దూరంలో ఉంది దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: క్యాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 65కిలోమీటర్ల దూరంలో ఉంది
లొకేషన్లాటిట్యూడ్: 11.75847, రేఖాంశాలు: 76.093826
మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.