పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున పశ్చిమ కనుములు మరియు అంత:సంధానం చేయబడ్డ 44 నదులతో కూడిన కేరళ ఒక ప్రత్యేక భౌగోళిక పరిస్థితులను కలిగి ఉంటుంది, అందువల్లనే ఇది ఆసియాలో అత్యంత ప్రజాదరణ పొందిన టూరిస్ట్ కేంద్రంగా భాసిల్లుతోంది. సుదీర్ఘమైన తీర ప్రాంతం, అందమైన బీచ్‌లు, ఎమరాల్డ్ బ్యాక్‌వాటర్స్ యొక్క ఆహ్లాదకరమైన స్ట్రెచ్‌లు, మది దోచుకునే హిల్ స్టేషన్‌లు మరియు అద్భుతమైన వన్యసంపద వంటివి మీరు కేరళలో ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్లేటప్పుడు మీ కొరకు వేచి ఉండే అద్భుతాల్లో కొన్ని. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ టూరిస్ట్ కేంద్రాలు అన్నీ కూడా ఒకదానికొకటి కేవలం రెండుగంటల ప్రయాణ దూరంలో ఉన్నాయి, భూమండలం మీద ఇలాంటి సదుపాయం మరెక్కడా కనిపించదు.
కేవలం ఘనమైన వారసత్వ సంపద మాత్రమే కాకుండా అభివృద్ధి మరియు పురోగతిపరంగా కూడా కేరళ ఎంతో ముందుంది. వందశాతం అక్షరాస్యత, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, భారతదేశంలో అతి తక్కువ శిశుమరణాలు మరియు అధిక జీవనప్రమాణ రేటు వంటి కొన్ని మైలురాళ్లను సాధించడం ఈ రాష్ట్ర ప్రజలకు నిజంగా గర్వకారణం.
భౌగోళిక స్వరూపం
కేరళ భౌగోళికంగా మూడు ప్రాంతాలుగా విభజించబడింది: పశ్చిమ కనుమల నుంచి కిందకు వాలిఉండే ఎత్తైన కొండల నుంచి విస్తారంగా వ్యాప్తి చెందిన కొండల యొక్క మిడ్‌ల్యాండ్‌లు మరియు లోయల నుంచి 580 కిలోమీటర్ల అవిఛ్ఛన్నమైన తీరప్రాంతంలోపాటుగా బ్యాక్‌వాటర్స్ మరియు అంత: అనుసంధానం చేయబడ్డ కాలువలు మరియు నదులతో ఇది నిండి ఉంటుంది. అటవీ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన అడవులతో ఆవరించి ఉంటుంది, ఇతర ప్రాంతాలు టీ మరియు కాఫీ తోటలు తేదా ఇతర సాగు రూపాల్లో ఉంటుంది. రాష్ట్రంలో చాలాప్రాంతం పచ్చదనంలో మునిగి ఉంటుంది, ఇది అన్నివేళలా ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది.
కాలాలు
సంవత్సరం మొత్తం కూడా ఆహ్లాదకరమైన మరియు సమశీత వాతావరణంతో ఉండే కేరళ ఉష్ణమండల ప్రాంతం, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో తేలికగా విశ్రాంతి పొందవచ్చు. కేరళలో జూన్ నుంచి సెప్టెంబర్ మరియు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు రుతుపవన కాలం మరియు ఫిబ్రవరి నుంచి మే వరకు వేసవి కాలం ఉంటుంది, ఈ రెండు కాలాలే ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తాయి. సాధారణంగా ఉండే 28 డిగ్రీల నుంచి 32 ఉష్ణోగ్రతలతో పోలిస్తే శీతాకాలంలో ఉష్ణోగ్రత కాస్తంత తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆహ్లాదకరంగా ఉండే ఈ వాతావరణం అతిధులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది.
ప్రజలు మరియు జీవితం
భారతదేశంలో భారతదేశంలో సామాజిక సంక్షేమం మరియు జీవన నాణ్యత పరంగా ఎంతో ముందంజ వేసిన రాష్ట్రం. భారతదేశంలోకెల్లా గరిష్ట అక్షరాస్యత రేటు, ఎక్కువ జీవన ప్రమాణ కాలం మరియు పిల్లల తక్కువ మరణాల రేటును కలిగి ఉన్నది. కేరళ మహిళల అక్షరాస్యత శాతం, ఆసియాలోకెల్లా ఎక్కువ. ప్రత్యేక కాస్మోపాలిటిన్ వ్యూపాయింట్‌ని ఆస్వాదిస్తూ, ఇక్కడ ప్రజలు, సమాజంలోని అన్ని స్థాయిల్లో సేవల్ని మరియు అవకాశాల్ని అందిపుచ్చుకునే స్థాయిలో ఉన్నారు.
చరిత్ర
కేరళ చరిత్ర వాణిజ్యంతో ఎంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నది, ఇటీవల కాలం వరకు ఇది సుగంధద్రవ్యాల వ్యాపారం చుట్టూ తిరిగేది. భారతదేశం యొక్క సుగంధద్రవ్యాల తీరంగా పేరుబడ్డ ప్రాచీన కేరళం గ్రీకులు, రోమన్లు, అరబ్‌లు, చైనీయులు, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వర్తకులు మరియు యాత్రికులకు ఆతిథ్యం ఇచ్చింది. దాదాపుగా వీరందరూ కూడా తమ ముద్రలను అనేక రూపాల్లో తమ జ్ఞాపకాలను ఈ గడ్డపై విడిచిపెట్టారు మరియు ప్రపంచంతో సంభాషించేందుకు మా ప్రత్యేక మార్గాన్ని రూపొందించుకునేందుకు మరియు డిజైన్ చేసేందుకు సహాయపడ్డారు.
లొకేషన్
కేరళ దక్షిణాసియాలో ఉన్న భారతదేశం యొక్క నైరుతి కొనలో ఉంది.
జిల్లా
వెబ్‌సైట్ గురించి
ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్‌సైట్, ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ట్రావెల్ వెబ్‌సైట్‌ల్లో ఒకటి. ఈ సైటులో దేవుడి స్వంత గడ్డగా పేర్కొన్న కేరళ గురించిన విస్త్రృత సమాచారం లభిస్తుంది. ఈ వెబ్‌సైట్ 1998 నుంచి ఆన్‌లైన్‌లో ఉంది, ఇది ఇప్పుడు 10 భారతీయ భాషలతో సహా 21 భాషల్లో లభ్యం అవుతుంది. సగటున, ఈ సైట్‌కు సాలీనా 3 మిలియన్‌కు పైగా విజిట్స్ ఉంటాయి. ఈ సైట్‌ని తరచుగా అవసరమైనప్పుడల్లా అప్‌డేట్ చేస్తుంటారు. దీనిలో కేరళకు సంబంధించి 3000 వీడియోలు, వేల ఫోటోలు మరియు వందల కొలదీ ఆడియో క్లిప్పులతో అతి భారీ డేటాబేస్ ఉంది. ఈ వెబ్‌సైట్ టూవే ప్రాసెస్ ద్వారా ప్రయాణీకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది మరియు, మెసేజ్ బోర్డు, టూర్ ప్లానర్, ఆన్‌లైన్ పోటీలు, ఆన్‌లైన్ ఆడియో- విజువల్ గ్యాలరీలు, వీడియో క్విజ్‌లు, లైవ్ వెబ్‌కాస్ట్‌లు, ఈ బుక్స్ ఈ న్యూస్ లెటర్స్ మొదలైన రెగ్యులర్ ఆన్‌లైన్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటరాక్షన్‌ల ద్వారా మారుతున్న ఆధునిక ప్రయాణీకుల ఆసక్తులను గమనిస్తూ ఉంటుంది. కేరళ టూరిజం వెబ్‌సైట్ అనేక అవార్డులను గెలుచుకుంది. ఇది ‘‘ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అత్యంత సృజనాత్మక వినియోగం’’ మరియు ‘‘బెస్ట్ టూరిజం వెబ్‌సైట్ పోర్టల్’’ కొరకు భారత ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఎక్సలెన్స్ అవార్డును 2000-2001, 2002-2003, 2005-2006, 2008-09, 2010-11, 2012-13, 2013-14 మరియు 2014-15 సంవత్సరాలకు గెలుచుకుంది. కేంద్ర సమాచారం మరియు ప్రసార మంత్రిత్వశాఖ ద్వారా ఏర్పాటు చేయబడ్డ వెబ్ రత్న అవార్డులు 2014లో అద్భుతమైన కంటెంట్’ క్యాటగిరీలో కేరళ టూరిజం వెబ్‌సైట్ గోల్డె్ ఐకాన్ అవార్డును గెలచుకుంది, అలానే పిసి వరల్డ్ మ్యాగజైన్ యొక్క నెట్ 4 పిసి వరల్డ్ వెబ్ అవార్డు 2008ని టూరిజంలో బెస్ట్ ఇండియన్ వెబ్‌సైట్ క్యాటగిరీలో గెలుపొందింది. ఫసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్స్ (పిఎటిఎ) గోల్డ్ అవార్డులను 2005, 2013, 2014 మరియు 2016లో అత్యుత్తమ ఈ న్యూస్ లెటర్ కొరకు మరియు 2010లో అత్యుత్తమ వెబ్‌సైట్ అవార్డును గెలుచుకోవడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. భారతదేశంలో, కేరళ టూరిజం వెబ్‌సైట్ ఒక దశాబ్దానికి పైగా టూరిజం బోర్డు వెబ్‌సైట్‌ల్లో వెబ్‌ట్రాఫిక్ పరంగా మొదటి స్థానంలో ఉంది. వెబ్‌ట్రాఫిక్ పరంగా, ఈ సైజు ఆసియా ఫసిఫిక్ మరియు మధ్య ప్రాచ్యంలో టాప్ 10 టూరిజం సైట్‌ల్లో ఒకటిగా నిలుస్తుంది.