మలబార్ చికెన్ బిర్యానీ ఒక నాన్ వెజిటేరియన్ రైస్ వంటకం, దీనిని పుడ్ వరల్డ్ నుంచి తీసుకోబడింది. మలబార్ స్టైల్లో తయారు చేసే బిర్యానీ రుచిని ప్రేమికులు ఎంతగానో ఇష్టపడతారు.
పదార్థాలు
బాస్మతీ రైస్- 1 కిగ్రా
చికెన్- 1
బిర్యానీ మసాలా పేస్ట్ (పచ్చి మిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, యాలకులు, మిరియాలు )- 4 టేబుల్ స్పూన్
పచ్చి మిర్చి - 10
అల్లం వెల్లుల్లి పేస్టు- 2 టేబుల్‌స్పూన్
కొత్తిమీర - 50 గ్రా
పుదీనా ఆకులు- 25గ్రా
పెరుగు- 150 గ్రాములు
టొమాటో - 150 గ్రా
ఉల్లిపాయ - 1 కిగ్రా
నల్ల ఆవాలు- 1 టేబుల్‌స్పూన్
దాల్చిన చెక్క- 2 ముక్కలు
బిర్యానీ ఆకులు- 2
జీడిపప్పు మరియు కిస్మిస్- 50గ్రాములు
దాల్చిన చెక్క- 5
నెయ్యి- 200గ్రాములు
యాలకుల పొడి- 2 టేబుల్‌స్పూన్
పాలు- 500మిలీ
కుంకుమ పువ్వు- 1 చిటికెడు
నీరు(అన్నం కొరకు)- 1 లీటరు
తయారు చేసే విధానం
ఒక పాన్‌లో నెయ్యి తీసుకోండి, దానిని ఉల్లిపాయలు వేసి, బంగారు వర్ణంలోనికి వచ్చేంత వరకు వేపండి. ఇప్పుడు తరిగిన టొమాటాలు కూడా చేర్చండి. పాన్‌లో, మిక్స్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు మరియు బిర్యానీ మసాలా, పసుపు మరియు ధనియాల పొడి వేయండి. దానికి చికెన్ ముక్కలు జోడించి, బాగా ఉడకనివ్వండి.
ఇప్పుడు బియ్యాన్ని 10 నిమిషాలపాటు నానబెట్టి, నీటిని తొలగించండి. ఇప్పుడు పాన్‌లో నెయ్యిని వేడి చేసి, దానిని మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, కిస్మిస్, బిర్యానీ ఆకు వేసి, గోధుమ వర్ణంలోనికి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దీనిని పాలు మరియు నీటిని జోడించండి. బాగా మరేంత వరకు వేచి ఉండి, దీనిని బియ్యాన్ని కలపండి. వేడిని తగ్గించండి, పాన్ మీద మూత పెట్టి, 15నిమిషాలపాటు ఉడికించండి.
మరో పాన్ తీసుకొని, దానిలో సగం రైస్ వేయండి. అన్నంపైన ఉడికించిన చికెన్‌ని ఉంచండి. చికెన్‌పై మిగిలిన అన్నం వేయండి. పాన్‌లో పదార్థాలు అంతా కూడా ఏకరీతిలో పరుచుకునేలా చూడండి. అన్నంలో అక్కడక్కడా రంధ్రాలు చేసి, కాస్తంత కుంకుమపాలు పోయండి. కొన్ని స్పూన్‌ల నెయ్యి, ఫ్రై చేయబడ్డ ఉల్లిపాయలు, జీడిప్పు మరియు కిస్‌మిస్ దానిపై వేసి, బాగా బిగుతుగా కవర్ చేయండి. ఎంతో రుచికరమైన మలబార్ బిర్యానీ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
సౌజన్యం: యువరాణి రెసిడెన్సీ, కొచ్చిన్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.